ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని ఎందరో టాప్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే మహేష్ మాత్రం ఎవర్ని కాదనకుండా తన స్వీట్ స్మైల్ తో కాలం గడపడం అతడి స్ట్రాటజీ. ఇలాంటి పరిస్తుతులలో దర్శకుడు హరీష్ శంకర్ అన్న మాటలకు మహేష్ తన తియ్యటి నవ్వుతో ఇచ్చిన సమాధానానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

రెండు రోజుల క్రితం జరిగిన ‘సమ్మోహనం’ మూవీ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన మహేష్ ను దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘‘పోకిరి.. బిజినెస్ మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ టైమింగ్ కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో శ్రీకాంత్ అడ్డాల స్టయిల్ కనిపిస్తుంది. దూకుడులో శ్రీను వైట్ల టైమింగ్ కనపడుతుంది. కొరటాల శివ సినిమాల్లో సటిల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇలా ఏ డైరెక్టర్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ స్టయిల్ ని మహేస్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటాడు. ఈ విషయంలో ఆయనను పాదరసం అనచ్చు’’ అంటూ హరీష్ శంకర్ మహేష్ ను ఆకాశానికి ఎత్తేశాడు. 
Harish Shankar
ఇది చాలదు అన్నట్లుగా మహేష్ ను తనకు అలవాటైన ఒక డిఫరెంట్  స్టైల్ లో చూపించాలని అనుకుంటున్నాను అంటూ తనకు మహేష్ తో సినిమాను చేయాలన్న కోరికను బయట పెట్టాడు. అయితే మహేష్ హరీష్ శంకర్ మాటలకు ఏమాత్రం స్పందించకుండా తన మార్క్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. 
Seetimaar
దీనితో ఈకార్యక్రమానికి వచ్చినవాళ్ళు వేరే విధంగా స్పందించారు అని తెలుస్తోంది. శ్రీనువైట్ల శ్రీకాంత్ అడ్డాల పూరి జగన్నాథ్ సుకుమార్ త్రివిక్రమ్ బోయపాటిలకు రకరకాల టేకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కానీ హరీష్ శంకర్ కు ఏవిషయంలో స్పెషాలిటీ ఉంది అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: