ఒకప్పుడు సూపర్ స్టార్ సినిమా అంటే కేవలం కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడేది. ఇప్పటికి రజిని ఇమేజ్ లో ఎలాంటి తేడాలు లేకున్నా సరే ఎందుకో ఈమధ్య రజిని సినిమాలు ప్రజాదరణ పొందట్లేదు. వరుస ఫ్లాపులు రజిని ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని చెప్పొచ్చు. 


కబాలి, కాలా రెండు భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు. కాని రెండూ అంచనాలను అందుకోలేదు. కోలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా టాలీవుడ్ లో ఈ రెండు నిరాశపరచాయి. ఇక ఈ ఎఫెక్ట్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే 2.ఓ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. 


దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో వస్తున్న 2.ఓ సినిమా రోబో సీక్వల్ గా వస్తుంది. రోబో రజిని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా. ఆ సినిమా సీక్వల్ గా భారీ అంచనాలతో వస్తుంది 2.ఓ. కబాలి, కాలా తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకోలేదు. ఒకవేళ 2.ఓ కూడా ఇలానే ఉంటే కచ్చితంగా రజిని తెలుగు మార్కెట్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది.


ఇప్పటికే కబాలి లాసుల ఎఫెక్ట్ కాలా మీద పడగా ఇది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. మార్కెట్ విషయంలో కూడా కాలా సగానికి సగం తగ్గింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ 2.ఓ మీద పడుతుందని అంటున్నారు. రిలీజ్ డేట్ కూడా రెండు మూడు వాయిదాలు పడుతూ వస్తున్న 2.ఓ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: