సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తానంటూ ముందుకు వచ్చింది.  నెల రోజుల వరుసగా వివిధ ఛానల్స్ లో సెలబ్రెటీలపై ఘాటైన కామెంట్స్ చేస్తూ వచ్చింది. అంతే కాదు కొంత మంది తనను మోసం చేశారంటూ కొన్ని వాట్సాప్ పిక్స్ సోషల్ పోస్ట్ చేసింది. ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్నప్రదర్శన చేసిన శ్రీరెడ్డికి అనూహ్య స్పందన రావడం..ఆమెకు సపోర్ట్ గా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చాయి.

ఇదే సమయంలో శ్రీరెడ్డి జనసేన అద్యక్షులు పవన్ కళ్యాన్..ఆయన తల్లిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారే శ్రీరెడ్డిపై అందరూ విమర్శలు గుప్పించారు..అంతే కాదు శ్రీరెడ్డికి సపోప్ట్ కూడా వెనక్కి తీసుకున్నారు.   దాంతో శ్రీరెడ్డి ఇంటి నుంచే సోషల్ మాద్యమాల ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసి వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.
Image result for NANI SRI REDDY
`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  తాజాగా దీనిపై స్పందించిన నాని భార్య సంజన `సినీ ప‌రిశ్ర‌మ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిస‌టీ కోసం వేరొక‌రి జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌డం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నుకోండి.  మరి ఈ ట్విట్ పై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తూ వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: