టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి చంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయరహదారిపై చలాకి చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనకాల కారు విద్వంసమవగా.. చంటి కారు స్వల్పంగా దెబ్బతింది.
Related image
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయరహదారిపై  జరిగింది.  అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ్వ‌రికీ ఎటువంటి గాయాలుకాలేదు. ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల నివాసితులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు.
Image result for chalaki chanti
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ అయిన చలాకి చంటి అతికొద్ది కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఆపై అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. యాంకర్ గా పాపులర్ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: