మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాను  మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ చెప్పుకోవచ్చు. ఎన్నో అంచనాల నడుమున మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మహేష్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమా గిరించి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా మహేష్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నదంటా.... అని ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది.

Image result for mahesh babu

బాలీవుడ్ వాళ్లకు ఇదేం అంత షాకింగ్ కాదు కానీ, స్పైడర్ సినిమా మహత్యాన్ని తెలిసిన వారికి మాత్రం ఇంతకు మించి షాక్ లేదు. దేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలను మూటగట్టుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఘనత వహించిన సినిమా అది. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్‌గా తొలి స్థానంలో ‘బాంబే వెల్వెట్’ ఉంటే రెండో స్థానంలో ‘స్పైడర్’ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.

Image result for mahesh babu

ఆ సినిమాను మహేష్ ఒకసారే ఎలా చేశాడో! అనేది అనేక మంది సందేహం. మిడ్ డే మాత్రం ఈ ప్రాజెక్టును మహేష్ రెండో సారి చేయబోతున్నాడని ప్రకటించేసింది. ఈ ప్రకటనకు కారణం దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇతడు స్పైడర్‌ను హిందీలో తీస్తానని చాన్నాళ్లుగా చెబుతున్నాడు. దాని కోసమని హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్‌లను సంప్రదించాడు. వారు నో చెప్పలేదు కానీ, కుదరదన్నట్టుగా స్పందించారట. దీంతో మళ్లీ మహేష్‌తో ఈ సినిమాను తీస్తానని, సంప్రదింపులు జరుగుతున్నాయని ఆ దర్శకుడు ప్రకటించేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: