బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్,  ఎన్నో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన గుల్షన్ గ్రోవర్ ఓ యువతికి బలవంతంగా ముద్దు పెడుతున్నారు.  రింగి రింగుల జుట్టుతో ఇట్టే ఆకర్షించే  ఆ అందమైన యువతిని వీరిద్దరూ పోటీ పడుతున్నారు. షారూక్‌, గుల్ష‌న్‌లు ముద్దుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రా అని అంద‌రూ తెగ ఆలోచిస్తున్నారు.  అదేంటీ  బాలీవుడ్ నటులు ఇలా చేయడం ఏంటీ అంటూ కోపం వస్తుందా...అయితే వీరిద్దరూ పోటీ పడీ ముద్దు పెట్టుకోవాలనుకుంటున్న ఆ ముద్దు గుమ్మ ఎవరో తెలిస్తే షాక్ తింటారు.

ఇంతకీ అమ్మాయి ఎవరో కాదండీ..అసలు అమ్మాయే కాదు..! బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌. ఆశుతోష్ గోవార్క‌ర్ తీసిన `భాజీ` సినిమాలోనిది ఈ ఫోటో. ఈ సినిమాలో నిందితుల‌ను ప‌ట్టుకునే అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆమిర్ న‌టించాడు.  సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంత గొప్ప స్టార్ హీరోలైనా ఒకానొక సమయంలో ఆడవేశం వేయాల్సి వస్తుంది.
Image result for baaji move amir sharkuk
బాజీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ పాట‌లో ఆమిర్ స్త్రీ వేషంలో వ‌స్తాడు...ఆ సమయంలో షారూఖ్, గుల్షన్ ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తారు..అప్పట్లో ఈ ఫోటో సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఈ ఫోటోను ముగ్గురు స్టార్ హీరోల అభిమానులూ షేర్ చేసుకుని మురిసిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: