కొన్నాళ్లు వెనుకపడి ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువతో హిట్ కొట్టగా రంగస్థలంతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. 125 కోట్ల కలక్షన్స్ తో చరణ్ రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది.


ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో నటిస్తాడని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ గ్యాంగ్ లీడర్ సీక్వల్ లో నటిస్తాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ సీక్వల్ గురించి వార్తలు వస్తుండగా దానిపై ఎలాంటి సమాచారం లేదు.


కాని లేటెస్ట్ గా తేజ్ ఐలవ్యూ ఆడియోలో రాం చరణ్ ను కే.ఎస్ రామారావుతో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పారు చిరంజీవి. అది కచ్చితంగా గ్యాంగ్ లీడర్ సీక్వల్ కోసమే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాల వారు. నిర్మాత ఎస్.ఎస్ రామారావు ఆ సినిమా రీమేక్ చేయాల్సిందే అంటున్నారట. తెలుగు సినిమాను మళ్లీ తెలుగులోనే అంటే ఎలా అంటే అదే కథని కొత్తగా చెబుతారన్నమాట.


ఇక గ్యాంగ్ లీడర్ గా చిరు సంచలనాలు సృష్టించగా చిరు స్థానంలో రాం చరణ్ ఆ టైటిల్ తో సినిమా తీస్తే మరోలా ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మరి ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: