ప్రతి మగవాడు తాను ప్రేమించిన అమ్మాయి శీలవతిగా ఉండాలని..తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకుంటారు.  భారత దేశంలో ప్రతిచోట ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.  మగవారి చేతిలో ఎంతో మంది అబలలు అన్యాయం అవుతున్నారు.  అలాంటి మగవారికి బుద్ది చెప్పేందుకు ఐదురు యువతులు చేసిన యుద్దమే ‘రియల్ దండుపాళ్యం’చిత్ర కథ. శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ లు నటించగా… సి. పుట్టు స్వామి నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే టీవీ సీరియల్ మాదిరిగా ఉన్నా సంభాషణలు మాత్రం ఆకట్టుకునేవిగా ఉన్నాయి. ‘తొమ్మిది నెలలు మోస్తే.. మనిషి పుడుతున్నాడు. కాని మానవత్వం ఉన్నవాడు పుట్టడం లేదు. అరవై ఏళ్లు దాటిన ముసలివాడినైనా.. ఇరవై ఏళ్ల కుర్రవాడినైనా అడిగిచూడండి మీరు మొదటి సారి వెళ్లిన గుడి ఏది అని.. ఖచ్చితంగా గుర్తులేదంటారు. కాని వాళ్లు చూసిన సెక్స్ సినిమాలు గుర్తు ఉంటాయి. అందుకే వాటికి భక్తి సినిమాలు అని పేరు పెట్టారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు మహేష్ మాట్లాడుతూ... కన్నడలో ఇదివరకే వచ్చిన దండు పాళ్యానికి, ఇప్పుడు నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ రియల్ దండుపాళ్యం‌కు చాలా వ్యత్యాసం ఉంది. 1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఎలా జరిగిందో అలానే సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో 5మంది హీరోయిన్స్, ఇద్దరు హీరోలు నటించారు. తప్పకుండా ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.

చిత్రం తారగణం : హీరో యువరాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, భారతీ బాబు, సుమిత్ర, మూర్తి, రఘు బట్, పద్మావసంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సభ్రం, మాటలు-పాటలు: భారతి బాబు, పివి ఎల్ ఎన్ మూర్తి, నిర్మాత: సి. పుట్టు స్వామి, డైరెక్టర్: మహేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: