బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు.  మొత్తం ఆరు సంఘ‌ట‌నల నేప‌థ్యంలో బ‌యోపిక్ రూపొందుతుండ‌గా, అందులో ఆయ‌న డ్ర‌గ్గ్స్‌కు అలవాటు పడటం, అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిల‌తో ఎంజాయ్ చేయ‌డం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాల‌ని చూపించ‌బోతున్నారు.
Image result for sanju movie stills
ఇదిలా ఉంటే.. ట్రైల‌ర్‌లో చూపించిన టాయ్‌లెట్ సీన్ త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని డిమాండ్స్ వ‌స్తున్నాయి. సంజూ ట్రైల‌ర్‌లో ర‌ణ్‌బీర్ నేల‌పైన ప‌డుకున్న‌ప్పుడు టాయ్‌లెట్ లీక్ అవుతూ వ‌చ్చి అత‌ని కాళ్ళు తాక‌డం, వెంట‌నే అత‌ను లేచి అరిచే ఆ సీన్ పూర్తిగా తొల‌గించాల‌ని , లేకుంటే సినిమా విడుద‌ల‌పై స్టే కోరుతూ కోర్టుకి వెళ‌తానంటూ స్వ‌చ్చంద కార్య‌క‌ర్త పృథ్వీ మ‌స్కే సెన్సార్ బోర్డుకి హెచ్చరిక చేశారు. 

‘సంజయ్ దత్ జైల్‌లోని ఓ బ్యారెక్‌లో ఉన్నప్పుడు అక్కడి టాయిలెట్ పొంగిపొర్లినట్లు మేం ట్రైలర్‌లో చూశాం. అయితే ప్రభుత్వం, జైల్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం జైళ్లలోని బ్యారెక్‌ల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూపలేదు. ఇప్పుడు ఈ సన్నివేశం వల్ల భారత్‌లోని జైళ్లు, జైళ్ల అధికారుల పట్ల చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.

ఒక వేళ సినిమాలో ఈ సన్నివేశాన్ని తొలగించపోతే సినిమా విడుదలను ఆపేయాలని కోరుతూ కోర్టుకు వెళ్తాం’ అని తన ఫిర్యాదులో పృథ్వీ పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీని హీరో రణ్‌బీర్ కపూర్, చిత్ర దర్శక నిర్మాతలకు కూడా పంపారు. మరి ఈ ఫిర్యాదుపై ‘సంజు’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: