భారత దేశ టెలివీజన్ రంగంలో బిగ్ బాస్ కి మంచి ఆదరణ పెరిగింది.  హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభించింది.  ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ 2 సీజన్ మొదలైంది.  బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్నారు.  ఇప్పుడు ఎన్టీఆర్ ప్లేస్ లో బిగ్ బాస్ 2 కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  అయితే బిగ్ బాస్2 ప్రోమోలో ‘ఇంకొంచెం మసాలా’అంటూ ఊదరగొట్టారు.  కానీ బిగ్ బాస్ 2 లో మాత్రం ఆ మసాలా ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. 
Image result for bigg boss season 1 telugu
అంతే కాదు బిగ్ బాస్ కంటెస్టంట్ల వ్యవహారం..వారి తీరు చూస్తుంటే నాని కి కూడా అసంతృప్తి కలుగుతుందట.  తాజాగా బిగ్ బాస్-2 రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో వీ6 ఛానల్ యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే. 
Image result for bigg boss season 2 telugu
  తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని... ఈ సీజన్ లో కూడా అది కొనసాగి ఉంటే బాగుండేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది.  ఒకప్పుడు తాను యాంకర్ గా ఉన్న సమయంలో కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసునని..కానీ బిగ్ బాస్ పుణ్యమా అని ఇరు రాష్ట్ర ప్రజలు తనను బాగా గుర్తించారని చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: