తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ చిత్రంతో హీరగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు, కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్న నాగార్జున నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున తనయులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా కొనసాగుతున్నారు.