గత కొంతకాలంగా టాలీవుడ్లోని కాస్టింగ్ కౌచ్ పై తన పోరాటం సాగించిన శ్రీరెడ్డి, ఇప్పుడు కొత్తగా  హీరో నాని పై నిందలు మోపిన సంగతి తెలిసిందే. తనని లైంగికంగా వాడుకున్నాడంటూ నానిపై రాయలేని పదజాలంతో ఫేస్బుక్ లో ఆరోపణలు చేసింది. ఇన్నాళ్లు ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోని నాని కూడా ఆమె కాస్త శృమించడంతో చాలా గట్టిగానే స్పందించాడు. ఆమెకు లీగల్ నోటీసులు పంపించి  చట్టపరమైన చర్యలకు దిగాడు.


కాగా నానిపై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలను ఆయన సతీమణి ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సైతం శ్రీరెడ్డి చర్యలను ఖండించాడు. గతంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు చేసిన నిర్వాకానికి ఆయన కాస్త ఆమెకు ఫేవర్ గా మాట్లాడినప్పటికీ ఈ సారి మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించాడు. నాని తనకు మంచి స్నేహితుడని తెలిపిన విశాల్, అంత‌ మాత్రాన నానిని స‌మ‌ర్థించ‌నని తెలిపాడు. ఇటీవల నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లను తిప్పికొట్టాడు. నాని ఎలాంటి వాడో అందరికీ తెలుసని, ప‌బ్లిసిటీ కోసం కాకుండా ఏదయినా నిజముగా జరిగి ఉంటే ఆధారాలను బయటపెట్టాలని కోరాడు.


ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తెలిపిన ఆయన, నిజంగా అలాంటిదేదో నిజంగా జరిగి ఉంటే సరైన ఆధారాలతో ముందుకు రావాలని, అప్పుడే భాదితులకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అంతే తప్ప జరగని వాటిని తమ పబ్లిసిటీ కోసం ఇతరులపై నిందలు మోపడం మంచిది కాదని అభివర్ణించారు. రోజుకు ఒకరి పేరును చెప్పుకుంటూపోతున్న శ్రీరెడ్డి వాలకం చూస్తుంటే ఏదో ఒక రోజు కాస్టింగ్ కౌచ్ లోకి తనను కూడా లాగి, తనపై ఆరోపణలు చేస్తుందేమో అని ఆయన ఎద్దేవా చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: