టాప్ యంగ్ హీరోల లిస్టులో ప్రధమస్థానం కోసం పోటీపడుతున్న రామ్ చరణ్ నిర్మాతగా మారి చిరంజీవితో తీసిన ‘ఖైదీ నెంబర్ 150’ ఘన విజయం సాధించడంతో ఈసారి ఏకంగా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని చరణ్ చిరంజీవి ‘సైరా’ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కు 250 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చుపెడుతున్న విషయం తెలిసిందే. ఈభారీ మూవీకి సురేంద్రరెడ్డి దర్శకుడుగా నియమించడంలో చిరంజీవి పెద్దగా ఆసక్తికనబరచకపోయినా పట్టుపట్టి చరణ్ ఈభారీ ప్రాజెక్ట్ ను సురేంద్ర రెడ్డికి అప్పగించాడు అన్నవార్తలు ఉన్నాయి. 
Huge Market For Chiranjeevi Saira Narasimha Reddy Movie
వాస్తవానికి ఈసినిమాను వచ్చేఏడాది సంక్రాంతి రేసులో నిలబెట్టి భారీ కలక్షన్స్ రాబట్టాలి అని చరణ్ ప్లాన్. అయితే జరుగుతున్న పరిణామాలతో ఈమూవీ కనీసం వచ్చే ఏడాది సమ్మర్ కైనా విడుదల అవుతుందా అన్న అనుమానాలు చరణ్ ను వెంటాడుతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ ఇప్పటివరకు రకరకాల కారణాలతో ఆశించిన స్పీడ్ లో జరగకపోవడమే కాకుండా ఈమూవీకి సంగీత దర్శకుడు ఎవరు అన్న విషయమై ఒకనిర్ణయం తీసుకోలేకపోవడం చరణ్ కు విపరీతమైన టెన్షన్ పెడుతున్నట్లు టాక్. 
The motion poster of 'Sye Raa Narsimha Reddy' starring Amitabh Bachchan and Chiranjeevi was also released.
చిరంజీవి కెరియర్ లో ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభమై ఇంతకాలం నడిచినా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను కూడ డిసైడ్ చేయలేని పరిస్థితులు ఎదురవ్వడం ఇదే మొదటిసారి అనిఅంటున్నారు. సురేంద్రరెడ్డి ఏమ్యూజిక్ డైరెక్టర్ పేరుకు ఓకె చేయకపోవడం అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీ షూటింగ్ ఇప్పటి వరకు సగంకూడ పూర్తి అవ్వకపోవడం చరణ్ కు మరింత అసహనాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. 
Amitabh And Ciranjeevi And Nayanthara Gettap In Saira
ఈమూవీకి కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ చాలా ఉన్న నేపథ్యంలో ఎంతలేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం 6నెలలు కావాల్సి ఉంటుంది అని అంటున్నారు. ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను పిలిపించి వార్ కి సంబంధించిన కీలకమైన ఎపిసోడ్స్ షూట్ చేస్తుప్పటికి ఈమూవీ ఎప్పటికి పూర్తి అవుతుంది అన్నవిషయమై సురేంద్ర రెడ్డి చరణ్ కు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేక పోతున్నాడని గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. దీనితో తనతో చేసిన ‘ధృవ’ మూవీను చూసి సురేంద్ర రెడ్డి పై పెంచుకున్న నమ్మకంతో ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ను ఈయంగ్ డైరెక్టర్ పై పెట్టి తప్పు చేసానా అన్న అంతర్మధనంలో చరణ్ ఉన్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: