Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 3:30 am IST

Menu &Sections

Search

మొత్తానికి తన అభిమాన హీరోని కలిసిన డ్యాన్సింగ్ అంకుల్!

మొత్తానికి తన అభిమాన హీరోని కలిసిన డ్యాన్సింగ్ అంకుల్!
మొత్తానికి తన అభిమాన హీరోని కలిసిన డ్యాన్సింగ్ అంకుల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే..ఓవర్ నైట్ లోనే దేశవ్యాప్తంగా పాపులారిటీ వస్తుంది.  ఆ మద్య ఓ వీడియో సాంగ్ లో మాలీవుడ్ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ కన్నుకొట్టిన సీన్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే..సినిమా సెలబ్రెటీలే కాదు..క్రీడారంగానికి చెందిన వాళ్లుకూడా ఈ అమ్మడికి ఫిదా అయ్యారు.  ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఓ వీడియోపై సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంసలు కురిపించిన‌ సంగ‌తి తెలిసిందే.
dus-ka-dum-salman-khan-dances-famous-dancing-uncle
గోవింద సినిమాలోని 'ఆప్ కె ఆ జానె సె' అనే పాటకు సంజీవ్ శ్రీవాత్సవ్ అనే ప్రొఫెస‌ర్ త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసిఅల‌రించాడు. అత‌ని ప్ర‌తిభ‌కి ముగ్ధుడైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గ‌ర్వంగా ఫీల‌వుతూ ట్వీట్ కూడా చేశాడు. మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఓ విశేషం ఉందని అన్నారు.   అయితే సంజీవ్ శ్రీవాత్సవ్ కు హీరో గోవింద అంటే వల్లమాలిన అభిమానం..కానీ ఇప్పటి వరకు ఆయన తప్ప సినీ ప్రముఖలంతా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ..తెగ మెచ్చుకున్నారు.