యూఎస్‌లో తెలుగు నిర్మాత‌, ఆయ‌న భార్య సెక్స్ రాకెట్‌లో దొర‌క‌డం సంచ‌ల‌నం సృష్టించింది. కిష‌న్ మోదుగుమూడి అలియాస్ విభా జ‌యమ్ మ‌రియు అత‌ని భార్య చంద్ర మోదుగుమూడి చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ న‌డిపించ‌డం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరోయిన్స్ ను సినిమా షూటింగులంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు రప్పించి, వారిని ఖరీదైన హోటళ్లలో ఉంచి, విటులను పంపుతున్న సెక్స్ స్కాంను అమెరికా పోలీసులు బట్టబయలు చేశారు.

అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న ఈ సెక్స్ స్కాండల్ చికాగో కేంద్రంగా నడుస్తోంది.    హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారిద్ద‌రిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు విష‌యంలో పూర్తిగా విచార‌ణ జ‌రిపి త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

ఇన్వెస్టిగేష‌న్‌లో ప‌లు కండోమ్ ప్యాకెట్స్ కూడా దొరికిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే ఓ హీరోయిన్ త‌న‌ని మాన‌సిక క్షోభ గురి చేయోద్ద‌ని ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయోద్దంటూ వేడుకున్న మెయిల్ ఒక‌టి ద‌ర్యాప్తులో దొరికింద‌ని పోలీసులు అన్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేశామని, ఈ కేసుపై పూర్తి విచార‌ణ జ‌రిపి అన్ని విష‌యాలు మీడియాకి వివ‌రిస్తామ‌ని అమెరికా పోలీసులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: