జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో మళ్ళీ సందడి మొదలయ్యింది...ఎన్టీఆర్ భార్య ప్రణీత మళ్ళీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..ఈ వార్తతో ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోంది..షూటింగ్ లో బిజీ బిజీ గా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఈ వార్తా చాలా రిలీఫ్ ని ఇచ్చినట్టే..అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు..

 Image result for ntr laxmi pranathi

తన రెండో కొడుకు రాకతో తన ఫ్యామిలీ మరింత పెద్దది అయ్యిందని మళ్ళీ నాకు బాబు పుట్టాడు అని అందరికి చెప్పడానికి సంతోష పడుతున్నాను అని ప్రకటించాడు..ట్విట్టర్ లో ఎన్టీఆర్ ప్రకటించగానే నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు..ఎన్టీఆర్, ప్రణతిల మొదటి సంతానం అభయ్ రామ్ వారసుడుగా పుట్టగా మళ్ళీ రెండో సంతానం కూడా వారసుడే పుట్టాడు..

 

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే...ఈ సందర్భంలో ఎన్టీఆర్ కి త్రివిక్రమ్, పూరి జగన్నాద్, దేవి శ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు..నందమూరి వంశానికి మరో సింహం దిగింది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు..అయితే రెండో కొడుకు అచ్చం తన తండ్రి ఎన్టీఆర్ పోలికలతో పుట్టాడని సమాచారం తెలుస్తోంది..ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ రెండో కొడుకు ఫోటో షేర్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: