ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభం అయిన ‘బిగ్ బాస్ 2’ ప్రారంభం అయి ఒక వారం రోజులు కూడ పూర్తి కాకుండానే ఈషో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ షోలో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు ఫన్ ఎలిమెంట్స్ లేక పోగా ఇంటి సభ్యులు మధ్య గొడవలు బుల్లితెర ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే స్థాయిలో మారిపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
ఏడ్చేసిన తేజస్వి
ఒక్క ఆసక్తికర మూమెంట్ కూడా ఈ ‘బిగ్ బాస్ 2’ షోలో లేకపోవడంతో రానురాను ఈ షో పై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి ‘బిగ్ బాస్ 2’ షోను చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఈకార్యక్రమం పట్ల మరింత అసహనానికి గురయ్యారు. నిన్నటి షోలో తేజస్వి ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులు కొందరు తనపట్ల ప్రవర్తించిన తీరుపై అసహనానికి గురై ఏడ్చేసింది. 
నూతన్ నాయుడు ఓవరాక్షన్
ఇక నూతన్ నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నాడని తాము అడగకపోయినా ఉచిత సలహాలు ఫిలాసఫీలు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నాడని అనవసరంగా లెక్చర్లు ఇవ్వడం మానుకోవాలని తనీష్ సామ్రాట్ తేజస్విలు ఎదురుదాడి మొదలు పెట్టారు. ఒకే టీమ్ లో ఉన్నా  తేజస్వి సంజన మధ్య అస్సలు పడక పోవడం చూస్తుంటే ఎలిమినేషన్ గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో అర్ధం అవుతుంది. 
బిగ్ బాస్‌లో మొదటి టాస్క్ పూర్తి
తేజస్వి వంటచేసి తానే అన్ని మార్కులు కొట్టేస్తుందని తనకూ అవకాశం ఇవ్వాలని సంజన వాదించిన తీరు దానికి తేజస్వి రియాక్ట్ అయిన తీరు ప్రేక్షకులకు మరింత అసహనాన్ని తెప్పించింది. నిన్న ప్రసారమైన ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా బోర్ కొట్టించిన నేపధ్యంలో ఈరోజు ప్రసారం అయ్యే షోను చూసే ఆసక్తి కూడ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే నాని హోస్టింగ్ జూనియర్ స్థాయిలో లేదు అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈ పరిస్థుతులు ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ఈషోకు మరింత రేటింగ్స్ తగ్గిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: