సూపర్ స్టార్ రజినికాంత్ సినిమాల వేగాన్ని పెంచారు. శంకర్ డైరక్షన్ లో రోబో సీక్వల్ గా మొదలుపెట్టిన 2.ఓ రిలీజ్ కాకముందే కాలా వచ్చేసింది. ఇక ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీద ఉంది. ఆ సినిమా కాకముందే మళ్లీ మరో సినిమాకు ముహుర్తం పెట్టేస్తున్నారట.


ఎన్నాళ్లనుండో అనుకుంటున్నా కుదరని రజిని, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందట. కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ అంటే కేవలం తమిళనాడులోనే కాదు తెలుగు, హింది భాషల్లో కూడా క్రేజ్ ఉంది. అక్షయ్ కుమార్ తో కూడా సినిమా తీసిన మురుగదాస్ రజినితో సినిమా అంటే సిని ప్రేమికులకు పండుగే అని చెప్పొచ్చు. 


ఈమధ్యనే మురుగదాస్ ఓ కథను రజినికి చెప్పాడట.. ముందు కథ రిజెక్ట్ చేసిన రజిని ఆ తర్వాత కొన్ని చేంజెస్ చేసి రజినికి వినిపించాడట. రజిని ఓకే చెప్పడంతో మురుగదాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడట. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది.


కబాలి, కాలా అంచనాలను అందుకోలేదు. రజిని ఇక సినిమాలను ఆపేస్తే బెటర్ అన్న టాక్ కూడా వచ్చింది. కాని క్రేజీ కాంబినేషన్స్ తో మళ్లీ రజిని ఫాంలోకి రావాలని చూస్తున్నారు. తెలుగులో ఫలితాలు ఎలా ఉన్నా కోలీవుడ్ లో మాత్రం కాలా సూపర్ హిట్ అయ్యింది. రాబోయే మురుగదాస్ సినిమా రజిని ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: