యంగ్ హీరో సుదీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ ఓవర్సీస్ ప్రేక్షకులకు నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రీమియర్ షోలను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీకి హిట్ టాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అమెరికా నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ‘సమ్మోహనం’ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో మారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మ్యాజిక్ వర్కౌట్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. 
కలసి వచ్చే అంశం
ముఖ్యంగా ఈమూవీలో హీరోయిన్ పాత్రలో నటించిన అదితి రావు హైదరి నటన ఈమూవీకి హైలెట్ అని అంటున్నారు.  సినిమా ఇండస్ట్రీ పై చాలామందిలో ఉండే చెడు అభిప్రాయాలను తొలిగించే విధంగా ఈమూవీలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డిజైన్ చేసిన సెటైరికల్ సీన్స్ బాగున్నాయి అని అంటున్నారు. ముఖ్యంగా అదితి రావుకు తెలుగు డైలాగ్స్ నేర్పించే గైడ్ పాత్రలో సుధీర్ బాబు నటన బాగుండటమే కాకుండా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినప్పటికీ
దీనికితోడు ఈసినిమాలోని లోకేషన్స్ పాటలు ఈమూవీకి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది అని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఈమూవీ ఫస్ట్ హాఫ్ ను ఇంద్రగంటి మోహన్ కృష్ణ సాగాతీసినట్లు తెలుస్తోంది. అయితే మంచి సన్నివేశాలతో పాటు కథలో పట్టు ఉండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు అని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. 
సైలెంట్ గా సెటైర్
దీనికితోడు సీనియర్ నటుడు నరేశ్ పాత్ర ఈమూవీలో అత్యంత కీలకంగా మారడమే కాకుండా అతడి పాత్ర ద్వారా దర్శకుడు మంచి హాస్యాన్ని రాబట్టాడు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతంగా నటించాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘సమ్మోహనం’ సుధీర్ బాబు కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే ఆస్కారం ఉంది అని అనుకోవచ్చు. ప్రస్తుతం రన్ అవుతున్న సినిమాలు అన్నీ నెగిటివ్ టాక్ తో రన్ అవుతున్న నేపధ్యంలో అనుకోకుండా ఈ సమయంలో వచ్చిన ‘సమ్మోహనం’ మన తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు కూడ నచ్చితే ఈమూవీ హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: