గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఇక్కడే అనుకుంటున్నాం.. కానీ   ఇప్పుడు అమెరికా దాకా పాకిపోయింది. అవకాశాల కోసం డబ్బుల కోసం కొందరు హీరోయిన్లు ఎంత దూరమైనా వెళ్తారు  అని చాటి చెప్పేలా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత ఆరు నెలల నుంచి ఈ రాకెట్ లో ఉన్నట్టుగా అనుమానింపబడుతున్న కొందరు ప్రవాస భారతీయుల మీద నిఘా వేసి ఉంచిన అమెరికా పోలీసులు ఎట్టకేలకు పక్కా వ్యూహం ప్రకారం నిందితులను పట్టుకోవడం సంచలనంగా మారింది.

అమెరికాలో....యూఎస్ ఇన్వెస్టిగేటర్స్ జరిపిన దర్యాప్తులో..టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అవాక్కయ్యే నిజాలు బయిటపడ్డాయి. టాలివుడ్ హీరోయిన్స్ తో..వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు భారతీయ దంపతులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. టాలివుడ్ లో....సినిమాలకు కో-ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్న..కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తితో పాటుగా అతని భార్య చంద్రని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికాగో డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఈ కేసు నడుస్తోంది.
sex
అయితే  కో-ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్న..కిషన్ మోదుగుమూడి  అలియాస్ రాజు వెనుక ఆసక్తికర కథే ఉంది. సినిమాలపై తనకున్న మోజుతో ప్రొడక్షన్ బాయ్ గా పరిశ్రమలో కాలుపెట్టి, పలువురి వద్ద పనిచేస్తూ, అంచెలంచెలుగా సహ నిర్మాత స్థాయికి ఎదిగిన కిషన్, సినిమాలపై మోజున్న ఎన్నారైలతో పరిచయం పెంచుకుని, వారి సాయంతో అమెరికాలో కాలు పెట్టాడని తెలుస్తోంది. 

ఎన్నారైలకు దగ్గరైన తరువాత, తాను విదేశాల్లో సినిమాలు తీస్తున్నానని, హీరోయిన్లను తీసుకు వస్తానని వారికి చెప్పి డబ్బు తీసుకునేవాడని సమాచారం. ఆ తర్వాత  హీరోయిన్ల కాల్ షీట్లు తీసుకుని వారిని విజిటింగ్ వీసాలపై అమెరికాకు రప్పించేవాడని, ఆ తరువాత తన దందాను సాగించాడని చికాగో పోలీసులు తమ చార్జ్ షీట్ లో వెల్లడించారు.  కాగా, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున కిషన్, చంద్ర దంపతులకు బెయిల్ ను ఇచ్చేందుకు చికాగో కోర్టు అంగీకరించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: