టాలీవుడ్ లో తన నడుం వొంపులతో వయ్యారాలు వొలకబోస్తూ..కుర్రాళ్లకు సెగలు పుట్టించిన హీరోయిన్ ఇలియానా.  దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారిపోయింది.  తెలుగులో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  తిరిగి తెలుగు లోకి రావాలని చూసినా దర్శక, నిర్మాతలు పెద్దగా ఛాన్సులు ఇవ్వలేదు. 
Related image
చివరికి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినా కూడా ఈ అమ్మడికి ఛాన్స్ రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్థిరపడింది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో  ఇల్లీబేబీ  ఫిజీ దేశంలో విహరిస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ను వెంట పెట్టుకుని ఈమె అక్కడ పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తిరుగుతూ ఇలియాన ఫిజీ అందాల్లో తన అందాలను మిక్స్ చేసి ఫొటోలను ఇన్‌స్టాగ్రమ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. ఫిజీ అందాలను, ఇలియానా అందాలను కలిపి సూపర్‌గా ఫొటోలు తీస్తున్నాడు ఈమె బాయ్‌ఫ్రెండ్. 

అయితే ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి రక రకాల రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలియానా ప్రెగ్నెన్సీ అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఇలియానా..షల్ మీడియా, వెబ్ మీడియాల్లో ఈ మేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తప్పు పట్టింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.

తను ప్రెగ్నెంట్‌ను కాదు అని, ఒకవేళ తనకు ఈ పాటికి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఆనందించేదాన్ని  చెప్పింది. ఇలియానాకు అతడు కేవలం బాయ్‌ఫ్రెండ్ మాత్రమే కాదు. వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందనే ప్రచారం కూడా ఉంది.  అయితే పెళ్లి అయిన విషయాన్ని ఇలియానా ఇప్పటి వరకు ఖండించలేదు...కాకపోతే తనకు ప్రెగ్నెన్సీ అన్న వార్తలను మాత్రం చాలా సీరియస్ గా ఖండించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: