టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు పూర్తిగా క్రేజ్ కోల్పోయిన త్రిష ప్రిన్స్ మహేష్ బాబు సమస్యను సెటిల్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారింది. తెలుగు తమిళ సినిమాలలో దాదాపు పదేళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష మహేష్ తో కూడ అనేక సినిమాలలో నటించింది. అనేకమంది యంగ్ హీరోయిన్స్ వస్తు ఉన్నా ఆమె తన బ్యూటీని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ అనేక తమిళ సినిమాలలో నటిస్తూనే ఉంది. 
Image may contain: 1 person, close-up
ఇలాంటి పరిస్థుతులలో ఆమెకు అనుకోకుండా ఒక సూపర్ చాన్స్ వచ్చింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ ఎన్నో ఏళ్ల నుంచో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతూ అనేక విజయంతమైన సినిమాలను నిర్మించారు. ఈమధ్య కాస్త విరామం ఇచ్చి సినిమా నిర్మాణానికి దూరం అయినా మహేష్ రాజమౌళీల కాంబినేషన్ లో ఒక మూవీ తీయాలని ప్రయత్నిస్తూ వారిద్దరికీ ఎన్నో సంవత్సరాల క్రితం అడ్వాన్స్ లు ఇచ్చి వారి డేట్స్ కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. 
mahesh-babu-fans-trolled-rajamouli
అయితే వీరిద్దరూ కూడ కెఎల్ నారాయణ మూవీ ప్రాజెక్ట్ ఉంటుంది అని ఓపెన్ గా చెపుతున్నా ఈమూవీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో మహేష్ రాజమౌళి లకే  తెలియనిపరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో కె.ఎల్. నారాయణ హీరోయిన్ త్రిషతో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ వేగేశ్న రీసెంట్ గా ఒక కథ రెడీ చేసి హీరోయిన్ త్రిషకు వినిపించడం కథ బాగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది అని అంటున్నారు. ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. 
Actress Trisha Krishnan Wet Hot Photos
దీనితో మహేష్ ప్రాజెక్టును పక్కనపెట్టి కె.ఎల్.నారాయణ త్రిషతో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సతీష్ వేగేశ్న ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో నితిన్ హీరోగా చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ పూర్తికాగానే ఈ మూవీ షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఏమైనా మహేష్ ఇచ్చిన వాగ్దానాన్ని త్రిష పూర్తి చేయడం ఆశ్చర్యకరం..  



మరింత సమాచారం తెలుసుకోండి: