బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక సినిమా విషయానికి వస్తే..హిట్ అయినా..ఫ్లాప్ అయినా సల్మాన్ కు ఉన్న ఇమేజ్ తోనే వారంలో వంద కోట్లు దాటినా ఆశ్చర్యం ఉండదు.   గత సంవత్సరం రంజాన్ సందర్భంగా రిలీజ్ అయిన ట్యూబ్ లైట్ భారీ డిజాస్టర్ గా మిగిలింది.  రిలీజ్ అయినవ రెండవరోజే థియేటర్ల నుంచి ఆ సినిమా తీసేసిన సందర్భాలు ఉన్నాయి.  కానీ ఈ సినిమా సల్మాన్ ఇమేజ్ తో దాదాపు 60 కోట్లు వసూళ్లు చేసింది. 

మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్నిసార్లు అర్థం పర్థం లేని మసాలా సినిమాల్లో నటిస్తుంటాడు సల్మాన్.  తాజాగా రంజాన్ సందర్భంగా రిలీజ్ అయిన ‘రేస్ 3’సినిమా పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అంటున్నారు ప్రేక్షకులు. సైఫ్ అలీ ఖాన్ హీరోగా దశాబ్దం కిందట వచ్చిన ‘రేస్’ అదిరిపోయే ట్విస్టులతో అలరించింది. సీనియర్ దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ ఆ చిత్రాన్ని రూపొందించారు. దానికి కొనసాగింపుగా సైఫ్ నే హీరోగా పెట్టి వాళ్లు తీసిన ‘రేస్-2’ కానీ ఇది అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.
Image result for salman khan race 3
దాంతో ఆ సిరీస్ ఆపివేయాలని చూసినా.. చిత్ర నిర్మాణ సంస్థ హీరోను.. దర్శకుల్ని పక్కన పెట్టేసి సల్మాన్ కథానాయకుడిగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’తీసింది. ఇక సినిమా విషయానికి వస్తే..దాదాపు రెండు గంటల నిడివిలో మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయని..అసలు స్టోరీ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి అని సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు ప్రేక్షకులు.
Image result for salman khan race 3
మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో సల్మాన్ రెచ్చిపోయి మరీ నటిస్తారని..ఐతే ఇందులో మరీ రాకెట్ లాంచర్ చేతులో పట్టుకుని విలన్ల మీదికి ప్రయోగించడంతో అది పెద్ద కామెడీ అయిపోయింది. జనాల్లో తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాడంటూ సల్మాన్ మీద పెద్ద ఎత్తునే విమర్శలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: