సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.  బాహుబాషా నటుడైన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలు అక్కడ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది..కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.  రోబో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రజినీ నటించిన సినిమాలు లింగ, కబాలి, కాలా వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  అయితే రజినీకాంత్ తన స్థాయి పక్కన బెట్టి మాఫియా తరహా సినిమాలు తీయడంపై అభిమానులు అసహనంగా ఉంటున్నారు. 
Image result for robo 2.0
రజినీ అంటే ఎంట్రటైన్ మెంట్ తో పాటు సందేశాత్మకంగా ఉంటాయని అభిమానులు భావిస్తుంటారు..కానీ ఈ మద్య రజినీ నటిస్తున్న సినిమాలు వాటికి భిన్నంగా ఉండటంతో అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.  అంతే కాదు ఆయన సినిమాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలపై దృష్టి పెట్టడం కూడా ఇందుకు మరో కారణం.   పా రంజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ రజినీ మ్యాజిక్ పని చేస్తుందని.. వండర్స్ జరిగే ఛాన్స్ ఉందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అలాంటివేమీ లేకుండా బాగా నిరుత్సాహ పరిచింది. 
Image result for robo 2.0
ఇది సూపర్ స్టార్ తర్వాత సినిమాలపై కూడా గట్టిగానే ప్రభావం చూపుతోంది.  ఇదిలా ఉంటే..శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ విషయంలో టెన్షన్స్ ఎక్కువయ్యాయి. 400 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించింది లైకా ప్రొడక్షన్స్. దీన్ని రాబట్టుకునేందుకు ఇతర భాషల రైట్స్ ను కూడా భారీగానే విక్రయించారు. తెలుగు వెర్షన్ ను 80 కోట్లు వెచ్చించి సునీల్ నారంగ్ కొనుగోలు చేయగా.. ఇప్పటికే 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించారట. 
Image result for robo 2.0
ఈ సినిమా మొదలై..దాదాపు రెండు సంవత్సరాలు దాటి పోయింది. సినిమా రిలీజ్ చేస్తామని చెబుతున్నా ఎదో ఒక కారణంతో పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.  ఇప్పుడు 2019 రిపబ్లిక్ డే అంటున్నారు కానీ.. దానిపై కూడా నమ్మకాలు లేవు. పెట్టుబడిపై భారీగా వడ్డీని నష్టపోతుండగా.. కాలా దెబ్బకి అసలు రిజల్ట్ పై కూడా అనుమానాలు తలెత్తాయి. దీంతో తన అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయాలని.. ప్రాజెక్టు బాగా డిలే అవుతోందని లైకా ప్రొడక్షన్స్ పై సునీల్ నారంగ్ ఒత్తిడి చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఇతరు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే బాట పట్టినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: