టాలీవుడ్లోని కాస్టింగ్ కౌచ్ కి తట్టుకోలేకపోతున్నా అంటూ ఈ మధ్య శ్రీ రెడ్డి ఇండస్ట్రీని  నగ్నంగా బజారుకీడ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో ఉన్న దంపతులు టాలీవుడ్ హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహిస్తూ కటకటాల పాలవడం మరోసారి ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చేలా చేసింది. ఇక వార్తా ఛానెళ్లలో దినికి సంబంధించి డిబేట్ల మీద డిబేట్లు జరుగుతున్నాయి. ఇలా ఒక ఛానెల్లో  జరిగిన చర్చా కార్యక్రమంలో యాంకర్ లాస్య అమెరికా నుండి ఫోన్ ద్వారా కొన్ని సంచలన విషయాలను తెలిపింది.


ఈవెంట్ల పేరుతో ఇండియా నుండి నటీమణులను తెప్పించుకుంటారని చెప్పిన ఆమె డాలర్ల ఆశచూపి వారిని వలలో వేసుకుంటారని తెలిపింది. తాత్కాలిక వీసా తో ఈవెంట్లు చెయ్యడానికి ఇక్కడికి వచ్చే  నటీమణులను నిర్వాహకులు షాపింగ్ పేరుతో రమ్మని అడుగుతారని చెప్పింది. షాపింగ్ అంటే దాని అర్థం పడుకోమని వచ్చే నటీమణులకు కూడా తెలుసని, ఒకవేళ వాళ్ళు ఆ షాపింగ్ కి ఒప్పుకుంటే పడుకోవడానికి ఇష్టమే అని చెప్పకనే చెప్పినట్లు అర్థం అని తెలియజేసింది. తాము ఉద్యోగాలు చేస్తూ డబ్బును ఎలా ఆదా చేయాలని తలగోక్కుంటే వీళ్ళు షాపింగ్ అంటూ ఆ డబ్బుతో రెండు నెలలపాటు ఇక్కడే జల్సాలు చేస్తారని చెప్పుకొచ్చింది. 


ఒక పేరు మోసిన హీరోయిన్ పేరును చెప్పడానికి ఇష్టపడని లాస్య, సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఒక నటి ఇటీవల  అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెలరోజుల పాటు వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించిందని సంచలన వాఖ్యలు చేసింది. తనను కూడా ఒక వ్యక్తి ఇలాగే అడిగాడని, తాను నిరాకరించడంతో పెద్ద పెద్ద యాంకర్లతోనే పడుకున్నా! నువ్వేంత అంటూ ఆ వ్యక్తి దూషించాడని తెలిపింది. ఆ యాంకర్ పేరు కూడా అతను చెప్పాడని తెలిపిన ఆమె, పేరును మాత్రం చెప్పడానికి నిరాకరించింది. బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అయిన తెలుగు వ్యక్తులే ఈ పనులు చేస్తారని, కానీ ఏం తెలియనట్లు నటిస్తారని ఆరొపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: