తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా తన మొదటి చిత్రంతోనే దుమ్ముదులిపాడు పూరి జగన్నాధ్.  పవన్ కళ్యాన్ లాంటి పవర్ ఫుల్ హీరో..విలక్షణమైన నటనతో మెప్పించే ప్రకాశ్ రాజ్ ఢీ అంటే ఢీ అనే విధంగా సాగిన చిత్రం ‘బద్రి’. ఈ చిత్రంతో రేణు దేశాయ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఇదే షూటింగ్ సమయంలో పవన్, రేణు ప్రేమలో పడ్డారు.  తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. విరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చట్టప్రకారం విడాకులు తీసుకున్నారు. 
Image result for renu desai
అప్పటి నుంచి పవన్, రేణు దేశాయ్ లు స్నేహితులుగానే కొనసాగుతున్నారు.  కాకపోతే పిల్లల విషయంలో మాత్రం ఎంతో శ్రద్ద వహిస్తుంటారు పవన్ కళ్యాన్.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌.. త్వరలో ఒంటరి జీవితానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోనే ఇందుకు కారణం.
Related image
ఆమె ఓ వ్యక్తి చేయి పట్టుకుని దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు, ఆ వ్యక్తి గురించి తెలుపుతూ.. ఓ కవితను కూడా ఆమె పోస్ట్ చేశారు. ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను... ఆ ప్రేమ కవిత్వంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నా... నా చెయ్యి పట్టుకో, ఎప్పటికీ విడవకు..’ అంటూ ఆ కవిత సాగింది.  ‘నిజమైన ప్రేమ గురించి ఎంత బాగా వర్ణించారు.. మాటల్లేవు’,‘మీ భవిష్యత్ జీవితానికి ఆల్ ది బెస్ట్’, ‘మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి దొరికారని అనుకుంటున్నా’ అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   అయితే, ఈ కామెంట్లపై రేణు ఇంకా స్పందించలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: