ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి తన తండ్రి వెంకట్రావ్ తో తనకున్న బంధాన్ని వివరిస్తూ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన తండ్రి తన చిటికిన వేలు పట్టుకుని తిరిగిన బజార్లు తన తండ్రితో కలిసి పరుగులు తీసిన పోలంగట్లు మధ్యలో తన తండ్రి తనకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ గుర్తుకు చేసుకుంటూ తన తండ్రి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసాడు. 
Chiranjeevi
ఇదే సందర్భంలో తన తండ్రి ప్రేమతోపాటు కోపాన్ని వివరిస్తూ తన తండ్రి చేతిలో తబలా మృదంగంగా తాను తండ్రి కోపం వల్ల పడ్డ పాట్లు వివరించాడు. తన తండ్రికి కోపం వస్తే తనను విపరీతంగా తిట్టే సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను మాత్రం ఒక్క మాట కూడ అనేవారు కాదని దీనికి కారణం పవన్ తమ తాతలా ఉంటాడని తమ తండ్రి భావిస్తూ ‘మా నాన్నవిరా’ అంటూ పవన్ ఏ తప్పులు చేసినా తన తండ్రి క్షమించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు చిరంజీవి. 
Chiranjeevi
ఇదే సందర్భంలో తాను సూపర్ హీరో అయినప్పటికీ తన దృష్టిలో మాత్రం రియల్ హీరో తన తండ్రి మాత్రమే అంటూ తాను ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో నటించిన తరువాత తన నటనను చూసి మురిసిపోయిన తన తండ్రి తనకు ‘ఫియట్ ప్రీమియర్ పద్మిని’ కారును గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని తన జీవితంలో మరిచిపోలేను అంటూ తన తండ్రి పై ప్రేమను వ్యక్త పరిచాడు చిరంజీవి. తన చిన్నతనంలో కృష్ణా పుష్కరాలకు తనను విజయవాడ తీసుకువెళ్ళి అక్కడ పుష్కరాల సందర్భంగా నడుపుతున్న డకోటా విమానంలో ఎక్కించిన సందర్భంలో తనకు కలిగిన థ్రిల్ ఇప్పుడు తాను ప్రయివేట్ జెట్ విమానాలలో తిరుగుతున్నా ఆ ఆనందం కలగడం లేదు అని కామెంట్స్ చేసాడు మెగా స్టార్. 
Chiranjeevi
ఇక తాను నటుడుగా మారడానికి తన తండ్రి స్ఫూర్తి అని చెపుతూ తన తండ్రి ప్రజానాట్య మండలిలో కొనసాగుతున్న రోజులలో తన తండ్రి దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చూసి ప్రభావితమై తాను నటుడుగా మారిన సందర్భాన్ని వివరించాడు. అదేవిధంగా తన తండ్రి ‘జగత్ కిలాడీలు’ ‘జగత్ జెంత్రీలు’ సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన విషయాన్ని బయటపెడుతూ తన తండ్రి కలలను నిజం చేసినందుకు తనకు గర్వంగా ఉంది అంటూ తన తండ్రి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు చిరంజీవి..  



మరింత సమాచారం తెలుసుకోండి: