యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమ అరవింద సమేత ట్యాగ్ లైన్ గా వీర రాఘవ అని పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసిన అరవింద సమేత వీర రాఘవ సిక్స్ ప్యాక్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఒక్కడు కాదు ఇద్దరని తెలుస్తుంది. వీర రాఘవ రెండు పాత్రల్లో కనిపిస్తాడట ఎన్.టి.ఆర్. తారక్ ది డ్యుయల్ రోలా లేక ఒకడే రెండు పాత్రల్లో కనిపిస్తాడా అన్నది చూడాలి.   


ఒకరు మాస్ లుక్ లో కనిపిస్తుండగా మరొకరు మోడ్రెన్ లుక్ లో కనిపిస్తారట. కచ్చితంగా ఎన్.టి.ఆర్ ఎన్నాళ్ల నుండో తన ఫ్యాన్స్ కోరుకునే ఫుల్ లెంగ్త్ మాస్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. డ్యుయల్ రోల్ లో ఎన్.టి.ఆర్ డబుల్ ధమాకా ఇస్తాడని చెప్పొచ్చు. 


ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి డైరక్షన్ లో మల్టీస్టారర్ కూడా చేస్తాడని తెలుస్తుంది. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమాకు ముందే త్రివిక్రం సినిమా పూర్తి చేస్తాడట. అరవింద సమేత సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: