నాని హోస్ట్ గా బిగ్ బాస్-2 మొదలై వారం అవుతుంది. మొదటి ఎలిమినేషన్ అందరి అంచనాలను మించి జరిగింది. గణేష్, సంజనా, నూతన్ నాయుడులలో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేటర్స్ గా తేల్చిన బిగ్ బాస్ ఫైనల్ గా నాటకీయ పరిణామాలతో నూతన్ నాయుడుని సేఫ్ చేసి సంజనాని ఎలిమినేట్ చేశారు.


సంజనా బిగ్ బాస్ హౌజ్ లో ఉంది ఒక వారమే కాని ఆ వారమే అందరికి తెలిసేలా హంగామా చేసింది. ప్రతి విషయంలో వాయిస్ పెంచుతూ వచ్చిన సంజనా ఫైనల్ గా ఆడియెన్స్ దృష్టిలో కూడా నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పరచుకుంది. అందుకే సంజనాని కాదనుకున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో కావాల్సింది మసాలానే అది సంజనా చేస్తుంది కదా అలా ఎందుకు అంటే.


ఆమె సెలబ్రిటీస్, కామన్ మెన్ అంటూ వివాదం లేవనెత్తడం జరిగింది. నా టెంపర్ ఏంటో చూపిస్తా అంటూ మాట్లాడటం ఆడియెన్స్ కు మాత్రమే కాదు బిగ్ బాస్ కు నచ్చలేదని తెలుస్తుంది. అందుకే ఊహించని విధంగా సంజనాని బయటకు పంపించేశారు. 


ఆమె ప్లేస్ లో మరో కొత్త కంటెస్టంట్ నందినిని బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించారు. ఆమె కూడా అంత గుర్తింపు ఉన్న నటి కాదు మరి ఈ నందిని హౌజ్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక వచ్చే వారం ఎవరు ఎలిమినేషన్ లో ఉంటారు. బిగ్ బాస్ మ్ప్లాన్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: