నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ గా తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తేజ ఎక్సిట్ అయిన ఆ ప్రాజెక్ట్ లోకి క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు. క్రిష్ వచ్చాడో లేదో షూటింగ్ స్పీడ్ పెంచేశాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం చాలామంది కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని తెలిసిందే.


ఈ సినిమా మొదలైననాటి నుండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దసరాకి వచ్చేది కాని అలా జరుగలేదు. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చారు. అందుకే సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ముఖ్యంగా బాలయ్యకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతి రేసులో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది.


అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే తరువాయని తెలుస్తుంది. జనవరి 9న ఎన్.టి.ఆర్ బయోపిక్ గా రాబోతున్న ఎన్.టి.ఆర్ మూవీ రిలీజ్ కాబోతుంది. నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రియులందరు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు 53 డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తారట.


ఈమధ్యనే బాలయ్య బర్త్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఎలాంటి రిస్కైనా చేసేందుకు బాలయ్య బాబు సరే అంటున్నాడట. ఎలాగు క్రిష్ డైరక్షన్ లో శాతకర్ణి సినిమాకు వర్క్ చేసిన అనుభవం ఉంది అందుకే షూటింగ్ చాలా స్పీడ్ గా సాగుతుందట. మరి అనుకున్న డేట్ కు వచ్చి బాలకృష్ణ సంచలనాలు సృష్టిస్తాడేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: