త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ మొదట సారిగా జత కట్టనుండటం తో ఈ సినిమా మీద అభిమానుల అంచనాలు తార స్థాయి కి చేరినాయి. అయితే ఏ సినిమా కైనా లాభాలు తెచ్చేవి మొదటగా శాటిలైట్  అమ్మకాలే.. అయితే ఈ సినిమా శాటిలైట్  రేట్ సుమారు 20 కోట్లు వరకు నిర్మాత డిమాండ్ చేస్తున్నట్టు టాక్. 

Image result for jr ntr

జై లవకుశ సినిమా అత్యధికంగా 14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు అరవింద సమేత సినిమాను అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్మాలని చూస్తున్నాడు నిర్మాత రాధాకృష్ణ (చినబాబు). అరవింద సమేత శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు ఇప్పటికే పోటీ మొదలైంది. రేసులో జీ తెలుగు ముందువరుసలో ఉంది. ఈ సినిమా హక్కులు ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో జీ తెలుగు చర్చలు జరుపుతోంది. మరోవైపు జీ తెలుగుకు పోటీగా స్టార్ మా కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ రెండు ఛానెళ్లు రాధాకృష్ణ చెబుతున్న ఎమౌంట్ కు దగ్గరగా లేవు.

Related image

అరవింద సమేత శాటిలైట్ రైట్స్ ను 20కోట్ల రూపాయలకు అమ్మాలనేది రాధాకృష్ణ ప్లాన్. అతడి లెక్కలు అతనివి. అజ్ఞాతవాసి చేదు అనుభవాలు రాధాకృష్ణను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తాకొట్టినా శాటిలైట్ రైట్స్ రూపంలో కొంతమేర ఒడ్డున పడొచ్చనేది నిర్మాత ఆలోచన. ఛానెళ్లు మాత్రం ఎన్టీఆర్ సినిమాపై 20 కోట్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. గత సినిమాకు 14 కోట్లు పలికిన ఎన్టీఆర్ శాటిలైట్ మార్కెట్ ను అమాంతం 50 శాతం పెంచడానికి ఛానెళ్లు ఒప్పుకోవడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: