మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ విడుదల ఇప్పట్లో లేకపోయినా ఈసినిమాకు సంబంధించిన వార్తలు అదేవిధంగా ఫోటోలు మెగా అభిమానుల మధ్య నిరంతరం హాట్ న్యూస్ గా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘సైరా’ టైటిల్ కు సంబంధించి చిరంజీవిని వెంటాడుతున్న ఒక సెంటిమెంట్ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. చిరంజీవి మెగా స్టార్ గా ఎదిగి 150 సినిమాలలో నటించినా అతడి సినిమాల టైటిల్స్ లో ‘సింహ’ అన్న అక్షరాలు ఉంటే చాలు ఆసినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి. 
The first poster of Chiranjeevi’s 151st filmSye Raa Narasimha Reddy is out.
‘సింహపురి సింహం’ దగ్గర నుంచి ‘కొదమసింహం’ వరకు ‘సింహం’ అన్న పదాలు చిరంజీవి సినిమాల టైటిల్స్ లో ఉంటే అవి ఫ్లాపులు అన్న సెంటిమెంట్ ఇప్పటి వరకు కొనసాగింది. ఈనేపధ్యంలో ఈ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి తాను నటిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ కథకు ‘సింహ’ అన్న పేరు ఎక్కడా కనపడ నీయకుండ ‘సైరా’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఈసినిమా కథ అంతా ‘నరసింహా రెడ్డి’ చుట్టూ తిరుగుతుంది కాబట్టి చిరంజీవి ‘సింహ’ సెంటిమెంట్ ఈసినిమాను కూడ వదిలిపెట్టదా అంటూ కొందరు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారాన్ని చేస్తున్నారు. 

ఇప్పుడు ఈ ప్రచారం చిరంజీవి దృష్టి వరకు వచ్చినట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా నిర్మాణ విషయంలో దర్శకుడు సురేంద్ర రెడ్డి చిరంజీవి అంచనాలను అందుకోలేక పోతున్నాడు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో తన ‘సైరా’ కు ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఏమిటి అంటూ చిరంజీవి భయపడుతున్నట్లు టాక్. వాస్తవానికి ‘సింహ’ టైటిల్ నందమూరి సింహం బాలకృష్ణకు గతంలో ఎన్నో విజయాలు ఇచ్చినా అదే సెంటిమెంట్ ను నమ్ముకుని ఈ ఏడాది విడుదలైన బాలయ్య మూవీకి ‘జై సింహా’ అని పేరు పెట్టినా ఆ సినిమా చెప్పుకోతగ్గ విజయాన్ని సాధించలేదు. 

దీనితో సినిమా కథలో కథనంలో వెరైటీ లేకుండా కేవలం సెంటిమెంట్స్ ను నమ్ముకుంటే ఎంతటి టాప్ హీరోల సినిమాలు అయినా ఫెయిల్ అవుతాయి అన్న విషయం మరొకసారి రుజువైంది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ‘సైరా’ పై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం కేవలం చిరంజీవి అంటే ఇష్టంలేనివారు చేస్తున్న ప్రచారం అనుకోవాలి..        


మరింత సమాచారం తెలుసుకోండి: