వచ్చేనెల మొదటివారంలో విడుదల కాబోతున్న ‘తేజ్ ఐ లవ్యూ’ మూవీ సక్సస్ సాయి ధరమ్ తేజ్ కు అత్యంత కీలకంగా మారిన నేపధ్యంలో ఈసినిమా ప్రమోషన్ ను ఇప్పటి నుంచే మొదలుపెట్టేసాడు మెగా మేనల్లుడు. ఈసందర్భంలో తేజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లేటెస్ట్ మూవీ విషయమై చేసిన వ్యాఖ్యాల వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
sai dharamtej's tej i love you movie first look revealed
సాధారణంగా హీరోలు తాము నటించిన సినిమాలు పరాజయం చెందితే ఆ పరాజయాన్ని ఆసినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడి ఖాతాలోకి వేసేస్తారు. ఆసినిమా సక్సస్ అయితే అమూవీ దర్శకుడుని సైడ్ లైన్ చేసి అంతా తమ వల్లే ఆ మూవీ విజయం సాదించింది అంటూ కామెంట్స్ చేస్తారు. ఇలాంటి విషయాలలో మెగా యంగ్ హీరోలు చాల ముందు చూపుతో ఉంటారు అన్న ప్రచారం ఉంది. 

ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్యూ’ గురించి మాట్లాడుతూ  "ఇది నా సినిమా కాదు. మూవీ అంతా కరుణాకరన్ స్టయిల్ లో ఉంటుంది. క్యారెక్టరైజేషన్లు, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అంతా కరుణాకరన్ స్టయిల్ లోనే ఉంటుంది. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. నాది, అనుపమ క్యారెక్టర్లను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి కారణం కరుణాకరన్ డైరక్షన్. టోటల్ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది" అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ఈసినిమా ఫెయిల్ అయితే తేజ్ ఈవిషయాన్ని దర్శకుడు కరుణాకరన్ అకౌంట్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి.
సాయిధరమ్ తేజ్ మనస్తత్వం పై సెటైర్లు !
ఇది ఇలా ఉంటే జూలై 6న మెగా హీరోల సెంటిమెంట్ ను నమ్ముకుని విడుదల అవుతున్న ఈమూవీలో నటించినందుకు సాయి ధరమ్ తేజ్ కు ఒక్క రూపాయి కూడ పారితోషికం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. కేవలం షూటింగ్ టైమ్ లో తన ఖర్చులకు మాత్రం ఈమూవీ నిర్మాత నుంచి డబ్బు తేజ్ అడిగి తీసుకున్నాడని టాక్. ప్రస్తుతం మెగా మేనల్లుడి మార్కెట్ పూర్తిగా పడిపోయిన నేపధ్యంలో ఈమూవీ కూడ సక్సస్ కాకపోతే తేజ్ ఫ్రీగా నటిస్తాను అన్నా అవకాశాలు వచ్చే సందర్భాలు ఉండవు అన్న కామెంట్స్  వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: