టాలీవుడ్ లో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.   అచ్చం మామ చిరంజీవి పోలికలు ఉన్న సాయిధరమ్ తేజ్ మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మంచి పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.  మెగా కుర్రాడు అంటే ఇలా ఉండాలని చూపించిన సాయిధరమ్ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  సుప్రీమ్ సినిమా తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న సాయిధరమ్ గతంలో తన మేనమామ పవన్ కళ్యాన్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన కరుణాకరణ్ ని నమ్ముకున్నాడు.
Image result for sai dharam tej tej i love still
శ్రేయ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘తేజ్‌ ఐ లవ్‌యూ’ పై మొదటి నుంచి భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.  ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ మాట్లాడుతూ..పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు.  కొంతకాలంగా తేజు వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు.

అయినా ఆయనతో సినిమా చేయడానికి కేఎస్ రామారావు ముందుకొచ్చారు.అందువలన ఈ సినిమాకి సాయిధరమ్ తేజ్ పారితోషికం వద్దన్నాడట. షూటింగుకి సంబంధించిన కొన్ని ఖర్చులు మినహా, పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అయితే సినిమా మంచి హిట్ అయితే.. లాభాలలో ఆయనకి వాటా ఇచ్చే ఉద్దేశంతో కేఎస్ రామారావు వున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ కి హిట్ పడటం ఖాయమని కరుణాకరన్ తన సన్నిహితులతో అంటున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: