తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి భారీ ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య శ్రీరెడ్డి పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ..సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రావాలంటే..కొంత మది దళారులకు పడక సుఖం అందించాల్సిందే..అలా అయితేనే సినిమా ఛాన్స్ వస్తుందని ఎంతో మది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని వారికి బుద్ది చెప్పేందుకు తాను ముందడుగు వేశానని అంటుంది.
Image result for sri reddy protest
  తన పోరాటానికి మంచి స్పందన వచ్చే సమయంలోనే పవన్ కళ్యాన్ ని తిట్టడంతో ఒక్కసారే విమర్శల పాలైంది.  అప్పటి నుంచి ఇంట్లో ఉండి పలువురిపై సోషల్ మాద్యమాల్లో తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. అయితే  శ్రీరెడ్డి ఎంత రెచ్చగొట్టినా సాక్ష్యాలు మాత్రం బయట పెట్టడం లేదు. సిఎన్ఎన్, ఐబిఎన్ లాంటి ఛానల్స్ కి ఇప్పటికే వ్యభిచారంలో ఉన్న హీరో హీరోయిన్ల  లిస్ట్ ఇచ్చేసాను అని చెబుతున్న శ్రీరెడ్డి వాటిని తానుగా ఎందుకు బయటపెట్టడం లేదన్న విషయం మాత్రం చెప్పడం లేదు.
Image result for sri reddy protest
ఈ అమ్మడు మరోసారి  బూతుల స్థాయిని బాగా పెంచేసి పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి అది ఎవరిని ఉద్దేశించి అన్నదో పేరు అందులో లేదు కానీ ఈజీగా అర్థమయ్యేలా క్లూ ఇచ్చింది. "పిచ్చి కామెంట్స్ చేస్తే పళ్ళు ఊడతాయ్. మనోభావాలు ఉన్నప్పుడు నీకు..ఎందుకు లేచిందిరా గూట్లే. ప్రోగ్రాం అవకాశం వచ్చింది..మూసుకుని చేసుకో. నా నోటి కాడ కూడు ఎలాగూ లాగేశావ్ ఇంకెందుకురా న్యాచురల్ నల్ల తాచు. నాకు కవ్వింపు చర్యలు చేయకు. చికాగో పోలీస్ లాగా మన పోలీస్ రంగంలోకి దిగితే నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ అన్ని బయటికి వస్తాయి" 6 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న శ్రీరెడ్డి పెట్టే ప్రతి పోస్ట్ అందరికి చేరిపోతోంది.

పదే పదే ఒకరిద్దరు హీరోలను టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి ఆధారాలు మాత్రం బయటపెట్టకపోవడం ఎవరూ తప్పుబట్టడం లేదు. పైన చెప్పినట్టు నిజంగానే పై ఛానల్స్ కు శ్రీరెడ్డి ప్రూఫ్స్ ఇచ్చి ఉంటే కనక రాబోయే రోజుల్లో జరిగే రచ్చ మామూలుగా ఉండదు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: