ఆనంద్ నుండి ఫిదా సినిమా వరకు శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆయన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఫిదాతో మళ్లీ ఆయన హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అంతేకాదు ఫిదా వల్ల సాయి పల్లవి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తీసుకొచ్చింది.


శేఖర్ కమ్ముల టైం తీసుకున్నా ఓ మంచి జోష్ తో వచ్చాడని ఫిదా చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ఇక ఫిల్మ్ నగర్ లో మాత్రం శేఖర్ కమ్ముల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈమధ్యనే కమ్ముల ఓ కథను బన్నికి వినిపించాడట.


బన్ని కూడా దాదాపు ఓకే అన్నట్టు టాక్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ప్రస్తుతం బన్ని హాలీడే ట్రిప్ లో ఉన్నాడు. అది ముగించుకుని వచ్చాక ఫైనల్ గా తర్వాత సినిమా ఎవరితో అన్నది చెబుతాడు. శేఖర్ కమ్ముల కాకుండా బన్నితో సినిమా చేసే దర్శకుల లిస్టులో విక్రం కె కుమార్ కూడా ఉన్నాడు.


శేఖర్ కమ్ములతో బన్ని సినిమా అంటే కచ్చితంగా సినిమా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. యువ హీరోలతో.. కొత్త నటులతో సినిమా చేసిన శేఖర్ కమ్ముల స్టార్ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. డిజే సక్సెస్ తర్వాత బన్ని చేసిన నా పేరు సూర్య ఫెయిల్యూర్ కాగా చేసే సినిమా ఏదైనా హిట్ గురి పెట్టాడు బన్ని. 



మరింత సమాచారం తెలుసుకోండి: