హైదరాబాద్‌‍లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇండ‌స్ట్రీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన నటీ నటులకు అవార్డులను ఇస్తూ , వారిని ఎంకరేజ్ చేసే ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం 65వ సంవ‌త్స‌రానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.  ఈ వేడుకకి తెలుగు, త‌మిళ‌, కన్నడ, మల‌యాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున హాజర‌య్యారు.


తార‌ల సంద‌డితో ఆ ప్రాంగణం కోల‌హాలంగా మారింది. తెలుగులో బాహుబ‌లి 2 చిత్రం ప‌లు అవార్డులు కొల్ల‌గొట్ట‌గా, ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ (అర్జున్ రెడ్డి), ఉత్త‌మ న‌టి సాయి ప‌ల్ల‌వి (ఫిదా) , ఉత్త‌మ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ( బాహుబ‌లి) ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డు అల్లు అరవింద్ చేతుల మీదుగా అందించారు.   


తెలుగు - ఉత్తమ చిత్రం - బాహుబలి 2 - ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) - ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) - ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) - ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా)-ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) - ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) - ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) - ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) - ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) - ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే - ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) - జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ - ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) - ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) - ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) - ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2)


తమిళం - ఉత్తమ చిత్రం - అరమ్ - ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) - ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) - ఉత్తమ నటి - నయనతార (అరమ్) - ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) - ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) - ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) - ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ - ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న - ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ - ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి - ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) - ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి)

 మలయాళం - ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ - ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ - ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ - ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) - ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ - ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ - ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ - ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ - ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) - ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ - ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర - ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) - ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) - ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి 

కన్నడ- ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె - ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) - ఉత్తమ నటుడు - రాజ్ కుమార - ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ - ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ - ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ - ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) - ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ - ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ - ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ - ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ - ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్

 


మరింత సమాచారం తెలుసుకోండి: