మాట నిలబెట్టుకోవటం మాతరం సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ కు అలవాటు. కాని ఈ తరం వచ్చింది ఆయన కొడుకు సూపర్ స్టార్ మహెష్ బాబు తీరు అంత గొప్పగా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా షూటింగ్ ఈరోజు డెహ్రాడూన్ లో మొదలైంది. ఈ విషయంపై న్యాయస్థానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

సంబంధిత చిత్రం

అసలు విషయలోకి వస్తే, బ్రహ్మోత్సవం సినిమా సమయంలో మహేష్ బాబు, పివిపితో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ సినిమాకు నిర్మాతలుగా దిల్ రాజు, అశ్వనీదత్ లు వ్యవహరిస్తున్నారు.

pvp filed case against mahesh babu కోసం చిత్ర ఫలితం

దీంతో పివిపి వారందరిపై న్యాయస్థానం తలుపు తట్టాడు. అయితే నిర్మాత పివిపి కి జరిగిన నష్టాన్ని విచారించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇప్పుడు చేస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్ట కూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కానీ చిత్ర బృందం వాటిని ఉల్లంఘించి డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలు పెట్టింది. 
కోర్టు ఆదేశాలను ధిక్కరించి నందున, దీంతో కోర్టు చాలా సీరియస్ అయింది. "కేసు కోర్టులో ఉంటే షూటింగ్ ఎలా మొదలుపెడతారు?" అంటూ మళ్లీ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత చిత్రం

దీంతో మహేష్ సినిమా మరోసారి చిక్కుల్లో పడటమేకాదు, చట్టం దృష్టిలో పలుచన అవ్వటం జరిగింది. అనేక ప్రేక్షకుల అభి మాని అయి ఉండీ న్యాయస్థానం ముందు అగౌరవాన్ని మూటగట్టుకోవటం ఆయనకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు  ఆయన శ్రేయోభిలాషులు.  దరిమిలా, మహేష్ బాబు కూడా కోర్టు కేసు తేలిన తరువాత సినిమా షూటింగ్ మొదలు పెడదామని చెప్పినా, నిర్మాత  కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడట. కానీ ఇప్పుడు షూటింగ్ దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరి నిర్మాత లు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!  

super star mahesh cinema shooting stopped in dehradun కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: