టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్స్ లో ఒకరైన మణిశర్మ ఇప్పుడు ఫాం కోల్పోయారు కాని ఒకప్పుడు స్టార్ సినిమా అంటే మణిశర్మ మ్యూజిక్ అన్నట్టుగా ఉండేది. ఒకేసారి తన సినిమాలన్ని థియేటర్ లో పోటీ పడేవి. అన్ని సినిమాలకు ఆయనే మ్యూజిక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.


స్టార్ అందరి సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో మనస్పర్ధల గురించి ప్రస్థావించారు. మహేష్ తో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమే కాని ఆ తర్వాత మహేష్ తో కలిసి మాట్లాడడానికి కుదరలేదని అన్నారు మణిశర్మ. ఇంతకీ మహేష్ తో మణిశర్మకు గొడవ ఏంటన్నది మాత్రం చెప్పలేదు.


ఖలేజా, తీన్ మార్, శక్తి సినిమాలు ఫ్లాపయ్యాయి. కాని అవన్ని మ్యూజికల్ గా సూపర్ హిట్. ఆ హీరోలెవరు తన వంక తిరిగి చూడలేదని అన్నారు మణిశర్మ. బహుశా ఇదే మహేష్ తో గొడవకు దారి తీసింది కాబోలు. ఏది ఏమైనా మహేష్ మొదటి సినిమా నుండి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ ప్రస్తుతం వెనుకపడ్డారు. 


మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ తో మంచి ఫాంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ గొడవలన్ని పక్కనపెట్టి ఓసారి కలిస్తే మాత్రం కచ్చితంగా సినిమా ఇచ్చే అవకాశం ఉంది. మళ్లీ మణిశర్మ తన ఇదవరకు ఫాం కొనసాగించే ఛాన్స్ వస్తుంది. మరి మణిశర్మ మహేష్ ను కలుస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: