బిగ్ బాస్ షో మొదటి సీజన్ ఎంతగా హిట్ అయిందో రెండో సీజన్ ప్రతీ ఎపిసోడ్ ను ఆతృతగా చూసేవారి సంఖ్యనే తెలియజేస్తుంది. జూన్ పదవ తేదీన అట్టహాసంగా ప్రారంభమయిన ఈ షో రెండవ సీజన్ ప్రారంభంలో కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్నా రాను రాను పుంజుకుంది. ఒక వారం గడవడంతో ఎలిమినేషన్ కూడా జరిగింది. ఈ ప్రక్రియలో  సంజన అనే పోటీదారు నిష్క్రమణకు గురయింది.


షో నుండి బయటకి వచ్చి రెండు రోజులు కూడా అవలేదు, వెంటనే తన బిగ్ బాస్ అనుభవాల గురించి తెగ ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హోస్టింగ్ ని పొగుడుతూ నాని హోస్టింగ్ ని కించపరిచేలా మాట్లాడిన ఆమె వ్యవహార తీరుపై నాని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీకు ఎవరి హోస్టింగ్ నచ్చింది అని యాంకర్ ఆమెకు ప్రశ్నవేయగా ఎన్టీఆర్ అని చెప్పిన ఆమె, అందుకు కారణం ఐ ఫోన్ ఉపయోగించినవాళ్లు సాధారణ ఫోన్ వాడటానికి ఎలా ఉంటుందో ఎన్టీఆర్ హోస్టింగ్ చూసిన తరువాత తనకు నాని హోస్టింగ్ అలానే ఉందంటూ తీవ్ర వాఖ్యలు చేసింది.  


ఎన్టీఆర్ ను నానిని అసలు పోల్చలేమని తెలిపిన ఆమె, అది సినిమాల్లో అయినా సరే మరెక్కడా అయినా సరే అంటూ తక్కువచేసి  మాట్లాడింది. కాగా ఆమె చేసిన వాఖ్యలపై  నాని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో అంత పొగరు అవసరంలేదని, ఎదుటివారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఆమెకు హితబోధ చేస్తున్నారు. నాని కూడా ఒకప్పుడు సాధారాణ మనిషే అని, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండటం మూలానే నేడు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నాడని, సంజన కూడా అలా ప్రవర్తించకపోతే జీవితంలో  ఎప్పుడూ పైకి రాలేదని సెటైర్లు వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: