బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్స్ మరియు డేటింగ్స్ కామన్. ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్ తో డేటింగ్ చేస్తాడో తెలియదు. ఎప్పుడు బ్రేక్ అప్ చేస్తాడో తెలియదు అయితే మొన్నటివరకు రణ్ బీర్ కపూర్ కత్రినా కైఫ్ తో డేటింగ్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు అలియా భట్ తో డేటింగ్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పడు మళ్ళీ పెళ్ళి వార్తలు వినిపిస్తున్నాయి.  గతంలో ఇతడి పెళ్లి కబుర్లు వినిపించాయి. అదిగో.. ఇదిగో.. త్వరలోనే రణ్‌బీర్, కత్రినా కైఫ్‌లు ఒక ఇంటివారు అయిపోతున్నారని అప్పట్లో మీడియాలో బాగా ప్రచారం జరిగింది.

Image result for ranbir kapoor and katrina

ఆ ప్రచారంలో రణ్‌బీర్ కుటుంబం కూడా ఇన్‌వాల్వ్ అయ్యింది. కత్రినాను కోడలిగా తీసుకోవడానికి రణ్‌బీర్ తల్లి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. రణ్‌బీర్ కుటుంబంతో కత్రినా కూడా క్లోజ్‌గా కనిపించింది. అప్పటికే వారిద్దరూ తమ లవ్‌నెస్ట్‌లో బస చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఇక పెళ్లే తర్వాయి అనుకుంటున్న సమయంలో బ్రేకప్ అన్నారు. సినిమా షూటింగుకు ప్యాకప్ చెప్పేసినంత ఈజీగా ఆ లివింగ్ రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పారు.

Image result for ranbir kapoor and alia bhatt

ఇప్పుడు మళ్లీ పాత కథే. రణ్‌బీర్ పెళ్లి అట, ఈసారి అలియా భట్‌తో! వీళ్లిద్దరి ప్రేమ గురించి ఈ మధ్యే ప్రచారం మొదలైంది. అప్పుడే పెళ్లి అనేంత వరకూ వచ్చేశారు. ఈసారి కూడా రణ్‌బీర్ కుటుంబం ఇన్‌వాల్వ్ అవుతోంది. ఈ మధ్యనే రణ్‌బీర్ తల్లి, చెల్లెలుతో కలిసి కనిపించింది అలియా. త్వరలోనే పెళ్లి భాజాలు అని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదంతా చూస్తుంటే కత్రినా, రణ్‌బీర్‌ల ప్రేమ కథే గుర్తుకు వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: