‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సక్సస్ తరువాత బాలకృష్ణ తన సినిమాలకు సంబంధించి ఎన్ని ప్రయోగాలు చేసినా అవేమి సక్సస్ కాకపోవడంతో ప్రస్తుతం బాలయ్య దృష్టి అంతా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉంది. ఈమూవీని వేగంగా పూర్తి చేసి రాబోతున్న సంక్రాంతి రేసులో నిలబెట్టాలని బాలకృష్ణ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. 
SS Rajamouli
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో సక్సస్ కోసం ఆరాటపడుతున్న బాలకృష్ణ అన్వేషణకు రాజమౌళి టీమ్ సహకారం అందించబోతూ ఉండటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’ ‘యమదొంగ’ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎమ్. రత్నం రాజమౌళికి అత్యంత సన్నిహితుడు. రాజమౌళి క్రియేటివ్ టీమ్ లో ఇతడు ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 
బాలకృష్ణ
‘లెజెండ్’ ‘సరైనోడు’ సినిమాలతోపాటు ప్రస్తుతం బోయపాటి చరణ్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీకి డైలాగులు వ్రాసాడు రత్నం. ఇది ఇలా ఉండగా ఈ రచయిత రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక పవర్ ఫుల్ కథను వ్రాసినట్లు సమాచారం. ఈకథ రాజమౌళికి బాగా నచ్చడంతో రాజమౌళి స్వయంగా బాలయ్యకు ఈ కథను రికమెండ్ చేసినట్లు టాక్. 
Haven’t decided on the director but will announce in a few days: Nandamuri Balakrishna about biopic of N.T. Rama Rao
అయితే ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఈమూవీ తరువాత వినాయక్ దర్శకత్వంలో మరొక సినిమా చేయవలసి ఉంది. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణకు రత్నం చెప్పిన కథ నచ్చినా డేట్స్ ఎక్కడవి అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి సలహాతో పాటు ఒత్తిడి కూడ పెరిగితే ఈ బిజీ మధ్యనే ఈ పవర్ ఫుల్ స్టోరీకి బాలయ్య ఓకె చెప్పే చాన్స్ ఉంది అని అంటున్నారు. అన్నీ కుదిరితే ఈ కథకు అనీల్ రావిపూడి కానీ బాబి కానీ దర్శకత్వం ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: