బాహుబలి రిలీజ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు జాతీయ మీడియాలో హల్‌చల్ రేపాయి. తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సందర్భోచితంగా ప్రభాస్, అనుష్క క్లారిటీ ఇచ్చారు.  తాజాగా ప్రభాస్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయమని, దాని గురించి చెప్పడం తనకు ఇష్టంలేదని, చెప్పాలనుకోవడం లేదని అన్నాడు.
పెళ్లి వార్తను దాచిపెట్టను
తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతానని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రభాస్ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తోన్న ‘సాహో’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అనుష్క పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఓ వైపు కొనసాగుతుంటే మరోవైపు ప్రభాస్ పెళ్లి గురించి ఓ జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.  అయితే మిర్చి చిత్రంలో నాతో కలిసి అనుష్క నటించిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత బాహుబలి సిరీస్ లో కలిసి నటించాం.  అయితే బాహుబలి సక్సెస్ తర్వాత మేం ఎక్కడున్న జంట బాగుందని అంటూ వచ్చారు.  అంత వరకు ఓకే కానీ మా మద్య ఇతర సంబంధాలు ఉన్నాయని అనడం అప్పట్లో దానిపై నేను క్లారిటీ ఇచ్చామని..మరోసారి ఇస్తున్నానని అనుష్క కేవలం నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అన్నారు. ఒకవేళ నా పెళ్లి విషయం ఓకే అయితే.. మీడియాకు, నా ఫ్యాన్స్‌కు తప్పకుండా తెలియజేస్తాను అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: