బిగ్ బాస్ మొదటి ఎలిమినేటర్ సంజనా హౌజ్ లో ఉన్నప్పుడే కాదు బయటకు వచ్చాక కూడా తన ఐడెంటిటీ కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటిదాకా ఆమె ఒక మోడల్ అన్న విషయం ఎవరికి తెలియదు ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే అందరికి తెలిసింది.


అంతేకాదు తను కేవలం కామన్ మ్యాన్ కేటగిరిలోకి వచ్చా కాబట్టే బిగ్ బాస్ నుండి తనని ఎలిమినేట్ చేశారని అంటుంది సంజనా. అక్కడ కామన్ మెన్ కు అన్యాయం జరుగుతుంది అన్న విధంగా సంజనా కామెంట్స్ ఉండటం ఆశ్చర్యకరం. ఇక హోస్ట్ గా నాని ఏమాత్రం పనికిరాడని తేల్చేసింది సంజనా.


తాను ఎన్.టి.ఆర్ ఫ్యాన్.. అయినా నాని సినిమాలను చూస్తాను.. బిగ్ బాస్ నడిపించే స్టఫ్ నాని దగ్గర లేదని అన్నది సంజనా. హౌజ్ ఉన్న వారం రోజుల్లో అక్కడ వారితో గొడవలు పడిన సంజనా బయటకు వచ్చాక బిగ్ బాస్ షో మీద నిందలు వేయడం మొదలుపెట్టింది. ఇక వారం రోజులు తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కేవలం తన కాస్టూమ్స్, ఇంకా ఫుడ్ ఫ్రీగా పెట్టారని అన్నది సంజన.   


అంతేకాదు తను ఇలా రాగానే నందిని అనే కంటెస్టంట్ ను లోపలకు పంపించారు. కేవలం తను రావడానికి వారం పడుతుంది కాబట్టి ఈ వారం తనని తీసుకున్నారని. భవిష్యత్ లో ఏ షోకైనా వస్తా కాని బిగ్ బాస్ రియాలిటీ షోకి మాత్రం వచ్చేది లేదని అన్నది సంజనా.     
  


మరింత సమాచారం తెలుసుకోండి: