సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి మూవీ తెలుగు తెర మీద అద్భుతాలు చేసింది. వైజయంతి బ్యానర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్టుతో వచ్చింది. ప్రియాంకా, స్వప్నా దత్ ఈ సినిమా నిర్మించారు.


అభిరుచి గల నిర్మాతలుగా అశ్వనిదత్ కూతుళ్లు మహానటి సినిమా తెరకెక్కించి తమ ప్రతిభ చాటుకున్నారు. కీర్తి సురేష్ సావిత్రిగా నటించగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో కనిపించాడు. నిజజీవిత పాత్రలన్ని పాత్రదారులుగా చేసిన నటీనటులు కూడా గొప్పగా నటించి మెప్పించారు.


పాతిక కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మహానటి 40 రోజుల్లో 42.9 కోట్లను వసూళు చేసింది. అంతేకాదు డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కింద కూడా బాగానే రాబట్టింది. రియాల వారిగా మహానటి 40 రోజుల వరల్డ్ వైడ్ కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే.. 


నైజాం : 12.25 కోట్లు 
సీడెడ్ : 2.6 కోట్లు 
ఉత్తరాంద్ర : 3.8 కోట్లు 
కృష్ణా : 2.35 కోట్లు  
ఈస్ట్  : 2.4 కోట్లు 
వెస్ట్ : 1.6 కోట్లు 
గుంటూర్ : 2.1 కోట్లు 
నెల్లూరు  : 0.85 కోట్లు 
ఏపి/తెలంగాణా మొత్తం వసూళ్లు : 28.05 కోట్లు 
ఓవర్సీస్ 11. 2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.4 కోట్లు  
ప్రపంచవ్యాప్తంగా 42.9 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: