ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలే పెద్ద సమస్యలుగా మారితే ఇప్పుడు వ్యభిచారపు ఆరోపణలు ఇండస్ట్రీలోని వ్యక్తులపై దురభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఇటీవల అమెరికాలో మన హీరోయిన్ల రంకు చేష్టలు బయటపడటం టాలీవుడ్ ను మరోసారి కుదిపేసింది. అవకాశాలు లేని వర్థమాన హీరోయిన్లకు ఈవెంట్ల పేరుతో అమెరికాకు పిలిపించుకొని వారికి డాలర్ల ఆశ చూపి మరియు బెదిరించి వ్యభిచారం చేయిస్తున్న మోదుగుముడి దంపతులను ఇప్పటికే అక్కడి ఫెడరల్ ఏజెన్సీ వారు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 


మొత్తం అయిదు నుండి ఆరు హీరోయిన్లను ఈ కేసులో బాధితులుగా చేర్చబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కథ ఇంకో మలుపు తిరిగింది. ఈ భాదితుల్లో ఒక ప్రముఖ తెలుగు యాంకర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక హిట్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన ఈ యాంకర్ నెమ్మదిగా ఇండస్ట్రీలో సైతం అడుగుపెట్టి ఇప్పుడు తన పెర్ఫార్మెన్సులతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. కాగా ఈమె కూడా చికాగో  వ్యభిచారపు వ్యాపారంలో ఒక భాదితురాలేనని మోదుగుముడి దంపతులు పోలీసు విచారణలో బయటపెట్టినట్లు సమాచారం.


గత కొన్నినెలల క్రితం అమెరికాకు వెళ్ళిన ఆ యాంకర్ ఇద్దరు ఎన్నారై లతో కలిసి శృంగారంలో పాల్గొన్నట్లు మోదుగుముడి దంపతులు పోలీసు విచారణలో తెలిపినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అంతేగాక మొన్న యాంకర్ లాస్య సైతం ఒక ప్రముఖ యాంకర్ కూడా వ్యభిచారం చేసింది అని వాఖ్యానించడం వెనుక కూడా ఈ హాట్ యాంకరే కారణమని స్పష్టంగా అర్థమవడంతో ఈమె పేరు అన్ని చోట్ల హాట్ టాపిక్ అయింది. ఇక ఈ వార్త వైరల్ అవడంతో పలు వార్తా ఛానెళ్లు ఈమె పేరును సైతం బయటపెట్టడానికి వెనుకాడకపోవడంతో సదరు ఛానెళ్ళని ఈమె తన పేరును వేయొద్దని బ్రతిమిలాడుకున్నట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాని, తన పరువును తీయొద్దంటూ ఛానెళ్ళని అర్థించడంతో వారు యాంకర్ అన్న పదానికే పరిమితమయ్యారంట.


మరింత సమాచారం తెలుసుకోండి: