రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లు విడిపోయినా గతకొన్ని సంవత్సరాలుగా స్నేహితులుగా కొనసాగుతూనే ఉన్నారు. పవన్ తన పిల్లల శ్రేయస్సు గురించి పూనా వెళ్ళిన సందర్భాలు అదేవిధంగా పవన్ గురించి రేణు దేశాయ్ అనేక సందర్భాలలో కామెంట్స్ చేసిన విషయాలు గతంలో చాల ఉన్నాయి. 
జూ పవర్ స్టార్ అని పిలవొద్దంటూ వార్నింగ్
దీనితో రేణు పవన్ నుండి విడిపోయినా ఆమెను పవన్ అభిమానులు తమ మెగా కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఈమధ్య రేణు తనకు ఒక వ్యక్తి తోడుదొరికింది అంటూ రెండు చేతులు కలిపి ఉన్న ఫోటోను లీక్ చేసి తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 
కొడకును చూసి మురిసిపోయిన రేణు
ఇది చాలదు అన్నట్లుగా నిన్న రేణు తన కొడుకు అకిరా నందన్ ను ఎవరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలవవద్దని అలా ఎవరైనా పిలిస్తే తనకు నచ్చదని అటువంటి కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ ను తాను బ్లాక్ చేస్తానని తెలిపింది. దీనితో రేణు దేశాయ్ పై పవన్ అభిమానులు విపరీతమైన అసహనానికి లోనవుతూ ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
ఫ్యాన్స్ అసంతృప్తి
ఇప్పుడు ఈ పరిణామాలు అన్నీ పవన్ దృష్టికి రావడంతో పవన్ ఈ విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం పవన్ తన పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ లో ఉంటున్న నేపధ్యంలో రేణు నిన్న తన కొడుకు అకిరా వారసత్వాన్ని తిరస్కరిస్తూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో పవన్ లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం తన పిల్లలు రేణు దేశాయ్ వద్ద పెరుగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఆమె వ్యవహరిస్తున్న తీరు తన పిల్లల ప్రవర్తన పై ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అన్న దిశలో ఆలోచనలు చేస్తూ రేణు మాటల పై లోతైన విశ్లేషణలు చేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: