తెలుగు ఇండస్ట్రీలో దేవి చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు.  రాక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ తాను ఏ చిత్రానికైనా సంగీత అందిస్తే..ఆ సినిమా గురించి కూడా విపరీతంగా ప్రమోషన్ వర్క్ చేస్తారు.  ఇక ఆడియో వేడుకల్లో దేవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక లక్ష్మీకళ్యానం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కలువకళ్ల సుందరి కాజల్ తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. 

ప్రస్తుతం తెలుగు లో ఈ అమ్మడికి అవకాశాలు కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది..కాకపోతే తమిళ ఇండస్ట్రీలో మాత్రం బిజీగానే ఉంది.  ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఆ మద్య వార్తలు తెగ హల్ చల్ చేశాయి..కానీ మనోడు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గానే కనిపిస్తున్నాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కాజల్ అగర్వాల్, నిన్నటితో 33 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాడు.  కాజల్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, "హే సూపర్ హ్యాపీ మ్యూజికల్, బర్త్ డే టూ యూ డియర్ కాజల్... అమ్మడు... జస్ట్ డూ కుమ్ముడు" అని ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: