సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కాలా. కబాలి తర్వాత అదే రేంజ్ అంచనాలతో వచ్చిన కాలా తెలుగులో మళ్లీ కబాలి లానే ఫ్లాప్ చవిచూసింది. రజినికాంత్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా కూడా తెలుగు ఆడియెన్స్ కు ఎక్కలేదు. అయితే కబాలిలానే కోలీవుడ్ లో కాలా సూపర్ హిట్ అయ్యింది.


అక్కడ రజిని క్రేజ్ తో సినిమా ఆడేసింది. కబాలి దెబ్బకు కాలా తెలుగులో కేవలం 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే చేసింది. చెప్పడానికి 50 కోట్ల దాకా రేటు చెప్పినా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అంత సాహసం చేయలేదు. ఇక 27 కోట్లకు తెలుగు రైట్స్ కొనగా కేవలం 7.49 కోట్లకే బిజినెస్ క్లోజ్ అయ్యింది.


రజినికాంత్ కాలా మళ్లీ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాసులు తెచ్చేలా చేసింది. ఎలా చూసినా 20 కోట్ల లాస్ కనిపిస్తుంది. పబ్లిసిటీ ఖర్చులు అదనమని చెప్పొచ్చు. కబాలి తర్వాత రంజిత్ కథ నచ్చి కాలా సినిమా చేసిన రజినికాంత్ తెలుగు ఆడియెన్స్ ను మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాడు.


కబాలి, కాలా సినిమాల ఎఫెక్ట్ కచ్చితంగా రోబో సీక్వల్ గా రాబోతున్న 2.ఓ సినిమా మీద పడుతుందని చెప్పొచ్చు. ఆ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోకపోతే ఇక తెలుగు మార్కెట్ పై రజిని ఆశలు వదులుకోవాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: