అసలు ఏమాత్రం తెలుగు ఆడియెన్స్ కు అలవాటు లేని రియాలిటీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో అన్ని భాషల్లో విస్తరించారు. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. తారక్ హోస్టింగ్ వల్లే బిగ్ బాస్ సీజన్ వన్ కు కొత్త క్రేజ్ వచ్చింది.


బిగ్ బాస్ 1 కూడా సూపర్ సక్సెస్ అయ్యింది ఎన్.టి.ఆర్ వల్లే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదలైంది. తారక్ బదులు నాని ఈ షో యాంకరింగ్ చేస్తున్నాడు. స్టార్ తర్వాత స్టార్ గా నాని బిగ్ బాస్-2 హోస్ట్ గా చేస్తున్నా ఎందుకో అనుకున్న రేంజ్ లో షో ఆడియెన్స్ ను ఆకట్టుకోవట్లేదు.


ఇదిలా ఉంటే నాని ఎలాగోలా ఈ సీజన్ ముగించేసినా ఈసారి బిగ్ బాస్-3కి కుదిరితే మళ్లీ ఎన్.టి.ఆర్ ను రప్పించేలా చూస్తున్నారట. ఒకవేళ ఎన్.టి.ఆర్ బిజీగా ఉంటే సూపర్ స్టార్ మహేష్ ను ఈ షో హోస్ట్ చేసేలా ఒప్పించేస్తున్నారట. షూటింగ్ స్పాట్ లో సూపర్ సెన్సాఫ్ హ్యూమర్ చూపించే మహేష్ ఈ షోకి పర్ఫెక్ట్.  


కాని మహేష్ డేట్స్ కోసమే కష్టపడాల్సి ఉంటుంది. స్టార్ మా గట్టిగా ట్రై చేస్తే బిగ్ బాస్-3 మహేష్ ను హోస్ట్ గా చేసేయొచ్చు. మహేష్ దానికి ఓకే అనాలే కాని తారక్, నానిలకు ఇచ్చిన రెమ్యునరేషన్ కు డబుల్, ట్రిపుల్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. మరి బిగ్ బాస్-3 మహేష్ హోస్ట్ గా చేస్తాడా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: